కలెక్టర్‌పై దాడి చేయడం హేయమైన చర్య
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వికారాబాద్ కలెక్టర్‌పై కొంత మంది దాడి చేయడం హేయమైన చర్య అని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు అన్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాజీవ్‌రెడ్డి, టీజీఓ జిల్లా అధ్యక్షుడు రాజ్‌గోపాల్, టెస్రా జిల్లా అధ్యక్షుడు చెన్నకిష్టన్న, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులపై దాడి చేసిన వారిని వెంటనే చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతుల ముసుగులో కొంతమంది అధికారులపై దాడి చేశారని ఆరోపించారు. ఇలా దాడులు చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుందన్నారు. ఉద్యోగులు కూడా ఈ ప్రాంతవాసులే అని ప్రజలు గుర్తించాలని హితవు పలికారు. అనంతరం కలెక్టర్ విజయేందిరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు చంద్రనాయక్, మదన్‌మోహన్, వెంకటేశ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, కృష్ణమోహన్, వెంకట్రామరెడ్డి, నందకిషోర్, నాగరాజు, కృష్ణకాంత్, కృష్ణ, నాగన్న, మహేశ్వర్‌రెడ్డి, కృష్ణకుమార్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment