గ్రూప్–3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్న గ్రూప్–3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రూప్–3 పరీక్షలపై డిపార్ట్‌మెంటల్, జాయింట్ రూట్, ఫ్లయింగ్ స్క్వాడ్, ఐడెంటిఫికేషన్, పోలీస్ నోడల్ అధికారులు, రీజినల్ కోఆర్డినేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం పరీక్షకు 9.30 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 2.30 గంటలకు కేంద్రం గేట్లు మూసివేస్తారన్నారు. అలాగే సోమవారం పేపర్– 3 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతుందని, పరీక్ష కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకే మూసివేస్తారన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంట ఇపరికరాలు తీసుకెళ్లరాదన్నారు. మహబూబ్‌నగర్, దేవరకద్రలోని 52 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు 19,465 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ హాజరు క్యాప్చర్ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment