భూసేకరణకు సమాయత్తం..
కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు బైపాస్ రహదారులు నిర్మించే ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లింపులు చేపట్టారు. కల్వకుర్తి, కొల్లాపూర్లో పరిహారం చెల్లింపులు దాదాపుగా పూర్తయ్యాయి. నాగర్కర్నూల్లో మాత్రం ఇంకా చెల్లింపులు జరగాల్సి ఉంది. మొదటి ప్యాకేజీలో భాగంగా కొల్లాపూర్ సమీపం వరకు జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. రెండో ప్యాకేజీలో సోమశిల రోడ్డు నుంచి మల్లేశ్వరం వరకు రహదారి నిర్మించనున్నారు. అందుకు అవసరమైన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. సోమశిల వద్ద ఐకానిక్ బ్రిడ్జి టెండర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అటవీ భూముల్లో రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన అనుమతులకు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment