మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/మెట్టుగడ్డ: ‘నీళ్ల చారు.. పలచనైన పాలు.. కర్రీ సైతం సరిగా ఉండదు..’ ఇదీ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు ఇస్తున్న డైట్. శుక్రవారం ‘సాక్షి’ బృందం ఈ ఆస్పత్రిని పరిశీలించగా ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. ఇక్కడ 450 పడకలు ఉన్నాయి. వాస్తవానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే అతి పెద్ద ఆస్పత్రి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది వస్తుంటారు. ప్రతినిత్యం స్థాయికి మించి రోగులతో కిక్కిరిసిపోతుంది. కాగా, ఇటీవల నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజనం తిని సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జీజీహెచ్‌లో పరిశీలించగా మెనూ సరిగా ఇవ్వడం లేదని రోగులు, సహాయకులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment