ఇదీ రోగులకు ఇస్తున్న మెనూ
పేషెంట్ డైట్ మెనూ వివరాలు
వారంలో ఏడు రోజులకు సంబంధించిన పేషెంట్ డైట్ మెనూ వివరాలిలా ఉన్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నంతో పాటు రాత్రివేళ అన్నం, డయాబెటిక్ వారికి చపాతి, పాలకూర పప్పు, కూరగాయల కర్రీ, సాంబర్, మజ్జిగ ఇవ్వాలి. ఇక సోమవారం ఉదయం సుజ్జి రవ్వా, పాలు, బాయిల్డ్ ఎగ్, మంగళవారం ఉదయం కిచిడి, పాలు, బాయిల్డ్ ఎగ్, బుధవారం ఉదయం రవ్వతో ఉప్మా, పాలు, బాయిల్డ్ ఎగ్, గురువారం ఉదయం పొంగల్ రైస్, పాలు, బాయిల్డ్ ఎగ్, శుక్రవారం ఉదయం సుజ్జి రవ్వతో ఉప్మా, పాలు, బాయిల్డ్ ఎగ్, శనివారం ఉదయం కిచిడీ, పాలు, బాల్డ్ ఎగ్, ఆదివారం ఉదయం పొంగల్ రైస్, పాలు, బాల్డ్ ఎగ్ ఇవ్వాలి. అయితే మెనూ ప్రకారం ఏ రోజూ సరిగా ఇవ్వడం లేదని రోగులు వాపోయారు. ముఖ్యంగా సాంబరు (పప్పుచారు), పాలలోనూ నీళ్లే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా బెండకాయ కర్రీని సైతం పలుచగానే అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment