పాలమూరు: మూడు రోజుల క్రితం మాగనూర్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురైన కొంత మంది విద్యార్థులను చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రి తీసుకురావడం జరిగిందని, పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే సూపరింటెండెంట్‌కు ఆదే శాలు ఇస్తే అందరిని సమన్వయం చేసుకుని పడకలు ఏర్పాటు చేసి కావాల్సిన చికిత్స అందించారని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిని శుక్రవారం ఎమ్మెల్యే సందర్శించి మొదట చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, ఆ తర్వాత డైట్ కాంట్రాక్ట్ కిచెన్‌లో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. రోగులకు అందించే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని, ఈ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పిల్లల చికిత్సపై సూపరింటెండెంట్ అక్కడే ఉండి పూర్తిగా మానిటరింగ్ చేశారన్నారు. అయితే ఉదయం పిల్లలకు అల్పహారం ఇచ్చే సమయంలో పురుగు వచ్చిందని కొంత మంది ఏదో సృష్టించాలని ప్రయత్నం చేశారని, వెంటనే అదనపు కలెక్టర్ విజిట్ చేసి తనిఖీలు చేసినట్లు చెప్పారు. ఫుడ్ కంట్రోల్ అధికారులు పూర్తిగా శాంపిల్స్ సేకరించి ఎక్కడా పురుగులు లేవని తేల్చి చెప్పారన్నారు. ఏ వార్డులో రాని పురుగులు ఈ ఒక్క విద్యార్థి టిఫిన్‌లో ఎలా వచ్చింది దీనికి వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా? లగచర్ల మాదిరిగా ఏదైనా చేశారా అనే అనుమానం ఉందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు చాలా కష్టపడుతున్నారని, చిన్నపాటి పొరపాట్లు దృష్టికి వస్తే సవరిస్తున్నామన్నారు.
13 మంది డిశ్చార్జ్
మాగనూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా జిల్లా జనరల్ ఆస్పత్రి చిన్న పిల్లల విభాగంలో చికిత్స పొందుతున్న 15 మంది విద్యార్థుల్లో శుక్రవారం 13 మంది డిశ్చార్జ్ కాగా మరో ఇద్దరూ చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒక విద్యార్థికి గుండెకు సంబంధించిన సమస్య ఉందని, మరో విద్యార్థినికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment