మనస్తాపంతోనే సాయిరెడ్డి ఆత్మహత్య
కల్వకుర్తి టౌన్: ఇంటికి దారి ఉండదేమోనన్న ఆలోచనతో తీవ్ర మనస్తాపానికి గురై వంగూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన సాయిరెడ్డి (85) ఆత్మహత్య చేసుకున్నారని కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లకు వివరాలు వెల్లడించారు. సాయిరెడ్డి 1981, 1988 రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పని చేశారు. ఇతడి ఇంటికి వెళ్లే వేరే దారిలో పశువుల ఆస్పత్రికి సంబంధించిన ట్రేవీస్ ఏర్పాటును అడ్డుకోవడంతో అధికారులు, గ్రామస్తులు అతడికి నచ్చజెప్పారు. శుక్రవారం తిరిగి పనులు చేస్తుంటే మరళ అడ్డుకోగా ఎస్‌ఐ, సిబ్బంది అతడికి నచ్చజెప్పి ఇంటి దగ్గర వదిలారు. కుటుంబసభ్యులు సైతం నచ్చజెప్పినా వినలేదు. సర్పంచ్‌గా పనిచేసినా తనకు గౌరవం లేకుండా పోయిందని శుక్రవారం మధ్యాహ్నం గ్రామం నుంచి కల్వకుర్తికి వచ్చి బస్టాండ్ సమీపంలో పురుగు మందు కొనుగోలు చేశాడు. రఘుపతిపేట రోడ్డు వైపునకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి అక్కడే పడిపోగా చూసినవారు బ్లూకోర్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. వారితో పాటు కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుమారుడు మాధవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి లేఖ దొరకలేదని.. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని వివరించారు.
కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment