30న పాలమూరులో రైతు దినోత్సవం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న (శనివారం) రైతు దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ ఖరారు కానప్పటికీ.. జిల్లా యంత్రాంగం బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా కలెక్టర్ విజయేందిరతో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శనివారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ మైదానంతో పాటు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ శివారులో బహిరంగ సభ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. సీఎం సభకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని అఽధికారులను ఆదేశించారు. వారివెంట అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, ఆర్డీఓ నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, అర్బన్ తహసీల్దార్ ఘంసిరాంనాయక్, డీటీ దేవేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాక?
బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment