మహబూబ్‌నగర్ రూరల్: పేదల కడుపు నింపడం కోసం ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం బస్తాల సరఫరాలో అధికారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలోని చిన్నదర్పల్లిలో గల స్టేట్ వేర్ హౌజింగ్ గోదాం నంబర్– 2లో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన 700 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉంచారు. అయితే బియ్యం కోసం డీలర్లు నవంబర్ నెలకు సంబంధించి ఇండెంట్ పెట్టుకోగా.. సంబంధిత గోదాం అధికారులు, సిబ్బంది రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసే విషయంలో తాత్సారం చేశారు. దీంతో అనుమానం వచ్చిన అప్పటి ఇన్‌చార్జి డీఎం విక్రమ్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేయగా బియ్యం బస్తాలు కనిపించలేదు. దీంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌కు సమాచారం అందించినట్లు సమాచారం. ఇటీవల కొత్తగా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇర్ఫాన్ సైతం ఈ విషయం తెలియడంతో గోదాంను సందర్శించి నివేదికను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు సమర్పించారు. అధికారులు లోతుగా పరిశీలన జరిపి గోదాంలో రూ.3 కోట్ల విలువ గల 680 మె.ట., బియ్యం మాయమైనట్లు తేల్చారు. దీంతో తీగ లాగితే డొంకంతా కలిదినట్లు అయింది. సంబంధిత గోదాం అధికారులు, సిబ్బంది స్థానిక రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో కలెక్టర్ విజయేందిర సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. అంతర్గత విచారణ పూర్తయితే అసలు దొంగలు బయటపడే అవకాశం ఉంది. గోదాంలో బియ్యం మాయానికి కారణమైన అధికారుల ఉద్యోగాలు ఊడిపోవడంతోపాటు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది.
గుట్టుచప్పుడు కాకుండా
680 మె.ట., స్వాహా
సంబంధిత అధికారులు,
సిబ్బందిపైనే అనుమానాలు
స్థానిక రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు
కలెక్టర్ సీరియస్.. అంతర్గతంగా
కొనసాగుతున్న విచారణ
Comments
Please login to add a commentAdd a comment