గందరగోళం
విద్యాశాఖలో
డీఈఓల బదిలీపై వెల్లువెత్తుతున్న విమర్శలు
నారాయణపేట డీఈఓ కార్యాలయం
● మాగనూరు విద్యార్థుల అస్వస్థత
ఘటనకు బాధ్యులెవరు..?
● డీఈఓ అబ్దుల్ ఘని సస్పెన్షన్ కాదు.. బదిలీ అని తేలిన వైనం
● రెండుసార్లు ఉత్తర్వుల జారీతో
విద్యాధికారుల్లో అయోమయం
● ‘పేట’కు బదిలీపై వచ్చేందుకు డీఈఓ గోవిందరాజులు అనాసక్తి
● సీఎం ఇలాకా కావడంతో
వెళ్లాలంటున్న ఉన్నతాధికారులు
డీఈఓ సస్పెండ్ కాదు.. బదిలీ
నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం విద్యార్థులు మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ మరుసటి రోజు గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు డీఈఓ అబ్దుల్ ఘని పాఠశాలకు చేరుకొని దగ్గరుండి వంట చేయించారు. కానీ, ఆ అన్నంలోనూ పురుగులు రావడం, మేం తినలేమంటూ విద్యార్థులు ఆహారం పారబోసి ఆందోళనకు దిగడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం అక్కడికి వెళ్లి ఘటనకు సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆరా తీశారు. ఆ తర్వాత డీఈఓ అబ్దుల్ ఘనిని సస్పెండ్ చేస్తున్నట్లు విలేకర్ల ఎదుట వెల్లడించారు. కానీ, శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం నుంచి డీఈఓ అబ్దుల్ ఘనీని వనపర్తి జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతటితో కాకుండా శనివారం మరో ఉత్తర్వులు జారీ చేశారు. అందులో వనపర్తి జిల్లాతో పాటు జోగుళాంబ గద్వాల జిల్లా డీఈఓగా అదనంగా అబ్దుల్ ఘనీకి బాధ్యతలు అప్పగించడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment