116 సివిల్ కానిస్టేబుళ్ల కేటాయింపు
మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్రంలోని వరంగల్ శిక్షణ కేంద్రంలో 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న జిల్లాకు చెందిన 116 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 58 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు జిల్లాలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సివిల్ మెన్ (పురుషులు) 79, సివిల్ ఉమెన్ 37 మంది ఉండగా.. ఏఆర్ మెన్ (పురుషులు) 49, ఉమెన్ ఏడుగురు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికి ఏడురోజులపాటు సెలవులు ఇవ్వగా ఈ నెల 28న సాయంత్రం రిపోర్ట్ చేయాల్సి ఉంది. అదే రోజు ఎస్పీ కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలో ఉన్న 16 శాంతిభద్రతల స్టేషన్లతోపాటు ఒక సీసీఎస్, ఒక ఉమెన్ పీఎస్, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో 116 మంది కానిస్టేబుళ్లను సర్దుబాటు చేయనున్నారు. కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లతో ఆయా స్టేషన్‌లలో సిబ్బంది కొరత తీరనుంది. ప్రధానంగా జిల్లాలో ఉమెన్ కానిస్టేబుళ్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా వచ్చిన 37 మంది సిబ్బందితో కొంత ఊరట లభించనుంది. వీరి కేటాయింపుతో ఆయా స్టేషన్స్ బలోపేతం కానున్నాయి.
మరో 58 ఏఆర్ కానిస్టేబుళ్లకు
28న పోస్టింగ్‌లు
Comments
Please login to add a commentAdd a comment