సమాజం మారితేనే భవిష్యత్
అడ్డాకుల: ప్రస్తుత సమాజం మారితేనే మన పిల్లల భవిష్యత్ బాగుపడుతుందని రిటైర్డ్ డీఈఓ విజయకుమార్ అన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజులు.. 1000 కిలోమీటర్ల బాపుబాటలో సత్యశోధన పాదయాత్రలో భాగంగా శనివారం అడ్డాకులలో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. జాతిపిత మహాత్మగాంధీ ఎదుర్కొన్న కష్టాలు, చరిత్ర తెలుసుకుని బాపూజీని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందడుగు వేయాలని సూచించారు. మన ఆలోచనలు, ఆశయాలు, ఆచరణ మారితే తప్ప మన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వలేమన్న దాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు. పెద్దలుగా ముందు మనం మారుదాం.. గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం.. పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దామని నినదించారు. సత్యం, అహింస పునాదిగా సమసమాజ స్థాపనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, భీమన్నయాదవ్, విజయమోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment