కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య | - | Sakshi
Sakshi News home page

కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

Published Sun, Nov 24 2024 5:10 PM | Last Updated on Sun, Nov 24 2024 5:10 PM

కట్టుకున్న భర్తను  కడతేర్చిన భార్య

కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

తెలకపల్లి: కట్టుకున్న భర్తకు తోడు నీడగా ఉండాల్సిన భార్య కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హత్యచేసిన ఘటన మండలంలో శనివారం వెలుగు చూసింది. నాగర్‌కర్నూల్‌ సీఐ కనకయ్య కథనం మేరకు.. మండలంలోని వట్టిపల్లికి చెందిన మూడిండ్ల ఈశ్వరయ్య (56)కు గ్రామంలోని వేర్వేరు ప్రాంతాల్లో 3.33 ఎకరాల పొలం ఉంది. ఈయనకు భార్య ఎల్లమ్మ, ఐదుగురు కుమార్తెలు స్వాతి, కవిత, సమీర, శివమ్మ, రేణుక ఉండగా ఇద్దరి వివాహం అయింది. ఒక ప్రాంతంలో ఉన్న 2.14 ఎకరాల భూమి విక్రయించి మిగిలిన కుమార్తెల వివాహాలు, ఇల్లు నిర్మించుకోవాలని ఈశ్వరయ్య అనుకున్నాడు. ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజులుగా ఇద్దరి మద్య గొడవ జరుగుతుంది. శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్న ఈశ్వరయ్యను అర్ధరాత్రి దాటిన తర్వాత భార్య ఎల్లమ్మ, కుమార్తె స్వాతి, అల్లుడు మల్లేష్‌, బావమరిది బాలస్వామి, మరదలు ఆశమ్మ కలిసి గొడ్డలితో నరికి హతమార్చి పరారయ్యారు. శనివారం ఉదయం ఇంటిపక్కల వారు చూసే సరికి ఈశ్వరయ్య రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. ఈశ్వరయ్య చెల్లెలు నిర్మల ఫిర్యాదు మేరకు ఎల్లమ్మ, స్వాతి, మల్లేష్‌, బాలస్వామి, ఆశమ్మపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వివరించారు.

సహకరించిన కుటుంబసభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement