‘శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేదు’
నవాబ్‌పేట/ హన్వాడ: శాంతిభద్రతలు పరిరక్షించి.. ప్రజలకు అండగా ఉండే విషయంలో ఎలాంటి రాజీలేకుండా పనిచేయాలని ఎస్పీ జానకి అన్నారు. అలాగే పోలీస్‌ష్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులను గౌరవించాలని, వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి.. రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీసులను ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించే వారిపై అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేయాలన్నారు. విధి నిర్వహణతోపాటు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని సిబ్బందికి చెప్పారు. కాగా వార్షిక తనిఖీల్లో భాగంగానే స్టేషన్‌ను సందర్శించినట్లు ఎస్పీ వివరించారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీ, ఎస్‌ఐ విక్రమ్ సిబ్బంది ఉన్నారు. అలాగే హన్వాడ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి ఫైళ్లను పరిశీలించారు. కేసుల వివరాల గురించి ఎస్‌ఐ వెంకటేష్‌ను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర సాధన
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ మేరకు ఈ నెల 29న దీక్షా దివాస్ సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ంలో ఏర్పాట్లను మాజీ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ఆమరణ నిరా హార దీక్షకు పూనుకున్న నవంబర్ 29న దీక్ష దివాస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీక్ష దివాస్ కు పార్టీ నాయకులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మా జీ చైర్మన్ వెంకన్న, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు, నాయకులు అన్వర్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్, వర్ధ భాస్కర్ పాల్గొన్నారు.
రేపు పీయూలోఇండక్షన్ కార్యక్రమం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం ఇండక్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీయూ ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప హాజరవుతారన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ధాన్యం క్వింటాల్ రూ.2,809
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. సోమవారం 11,263 క్వింటాళ్ల ఽపంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,809, కనిష్టంగా రూ.1,936 చొప్పున పలికాయి. అలాగే మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,589, కనిష్టంగా రూ.2,167, హంస రకం గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.2,089, వేరుశనగ గరిష్టంగా రూ.6,595, కనిష్టంగా రూ.5,869 లభించాయి.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2,701
దేవరకద్ర మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,701, కనిష్టంగా రూ.2,049 ధరలు లభించాయి. హంస గరిష్టంగా రూ.2,100, కనిష్టంగా రూ.1,901గా ధరలు నమోదయ్యాయి.
బాధ్యతల స్వీకరణ
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత సోమవారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పూలబొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని చైర్‌పర్సన్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నందకిషోర్‌గౌడ్, జ్యోతి, చైతన్య, చైతు చౌహాన్, శశికిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment