కురుమూర్తివాసా గోవిందా..
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి జాతరకు భక్తులకు భారీగా తరలివస్తున్నారు. సోమవారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టి, ఆలయ మెట్లపై, స్వామివారి పాదుకుల వద్ద, ఆలయ సన్నిధిలో దీపాలు వెలిగించి దర్శించుకున్నారు. పలువురు భక్తులు కొండ దిగువన దాసంగాలు పెట్టి గండదీపాలు మోసి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలువేలు మంగమ్మ, ఉద్దాల మండపం, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాల వద్ద, జాతర మైదానంలోని దుకాణాల్లోభక్తుల రద్దీ కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పించారు.
కోడెదూడల వేలం..
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామివారికి మొక్కుబడిగా సమర్పించిన కోడెదూడల వేలాన్ని సోమవారం ఆలయ అధికారులు నిర్వహించారు. వేలం ద్వారా రూ.1.68 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శివానందాచారి, సభ్యులు కమలాకర్, ఉంద్యాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జాతరకు తరలివస్తున్న భక్తులు
ఆలయంలో ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment