విద్యార్థుల బాగోగులపై రాత్రి బస
ఉండవెల్లి: విద్యార్థుల బాగోగులను తెలుసుకోవడానికి పాఠశాలల్లో రాత్రి బస చేస్తున్నట్లు సీఎంఓ జాయింట్ సెక్రటరీ సంగీత అన్నారు. మంగళవారం ఉండవెల్లి మైనార్టీ పాఠశాలను ఆమె సందర్శించిన ఆమె రాత్రి అక్కడే బస చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి వేళ విద్యార్థుల చదువు, ఆరోగ్య పరిస్థితులు, ఉపాధ్యాయుల బోధనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలను మహిళా ఐఏఎస్ అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జిల్లా మైనార్టీ శాఖ అధికారి రమేష్, తహసీల్దార్లు హరికృష్ణ, మదన్‌మోహన్, డీటీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ట్రమణ, తదితర్లు పాల్గోన్నారు.
సీఎంఓ జాయింట్ సెక్రెటరీ సంగీత
Comments
Please login to add a commentAdd a comment