ప్రాథమిక హక్కులపై అవగాహన తప్పనిసరి
హన్వాడ: రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి అని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి ఇందిరా అన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాల్యవివాహాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలపై పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కలలను సాకారం చేసేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించుకొని చదవాలని అన్నారు. ఉచిత న్యాయ సహాయంతో పాటు బాలలు, మహిళలకు హక్కులను తెలిపేందుకు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పని చేస్తుందన్నారు. బాలలు ఏదైనా సమస్య వస్తే 1098కు ఫోన్‌చేస్తే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. పిల్లల హక్కులను భంగం కలగకుండా వారికి సహాయం చేసేందుకు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్పందన, సీనియర్ న్యాయవాది రవికుమార్‌యాదవ్, చైల్డ్‌ప్రొటెక్షన్ అధికారి రాములు, పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
గొడవలు పెట్టుకోవద్దు
స్థానిక పోలీస్‌స్టేషన్‌ను జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర తనిఖీ చేశారు. ఈసందర్భంగా భూవివాదంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చిన టంకర రైతులతో మాట్లాడారు. వివాదానికి సంబంధించి ఇరువురు అభిప్రాయాలను రైతులతో అడిగి తెలుసుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, గొడవలు పెట్టుకోవద్దని వారికి సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో చైల్డ్‌ప్రెండ్లీ కమిటీ బ్యానర్‌ను ఏర్పాటుచేసి పోలీస్‌స్టేషన్‌లో నమోదు అవుతున్న కేసుల వివరాలను ఎస్‌ఐను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment