No Headline
ఈ ఫొటోలో దివ్యాంగురాలైన వితంతు మహిళ పేరు జె.అరుణ. కావేరమ్మపేటకు చెందిన ఆమెకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానికంగా డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని.. ఆమెకు కేటాయించిన ఇల్లును ఇతరులకు అప్పగించారు. దిక్కుతోచని స్థితిలో ఆమె ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. మంగళవారం జరిగిన గ్రామసభలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఆమె పేరు రాలేదు. దీంతో ఆ మహిళ అధికారులను అడగగా.. విచారణ చేస్తామని, మళ్లీ దరఖాస్తు చేసుకోమని సమాధానమిచ్చారు. దీంతో ఆమె మళ్లీ దరఖాస్తు చేసుకుంటూ.. ఇప్పటికై నా న్యాయం చేయాలని వారిని వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment