ఇష్టపడి చదివితే విజయం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు ఇష్టపడి చదివితే తప్పక విజయం సాధిస్తారని డీఈఓ ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక అన్నపూర్ణగార్డెన్స్‌లో పదో తరగతి విద్యార్థులకు కలాం డ్రీ ఫోర్స్, విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి 10జీపీఏ సాధించేందుకు కృషిచేయాలన్నారు. ఉపాధ్యాయులు కూడా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు పదో తరగతి ప్రశ్నపత్రంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విజేత వెంకట్‌రెడ్డి, సైకాలజిస్ట్ శ్రీనివాస్, ఎఎంఓ శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్, డ్రీఫోర్స్ సభ్యులు శ్రీధర్, వెంకటేశ్వర్లు, పద్మజ, చక్రవర్తిగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment