కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కూడా కరుణించలేదు. సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక రంగ అభివృద్ధి, మాచర్ల– గద్వాల రైల్వేలైన్‌తో పాటు కొత్త మార్గాలు, నూతన నవోదయ పాఠశాలల మంజూరు ఇలా ఏ ఒక్క దానికి శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పైసా
విదిల్చలేకపోయారు. ఫలితంగా అన్నిరంగాల్లో వెనకబడిన ఉమ్మడి పాలమూరుకు మరోసారి
మొండిచెయ్యే ఎదురైంది. అయితే వేతన జీవులకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను
మినహాయింపు, రైతాంగానికి కిసాన్ క్రెడిట్ కార్డులపై రూ.5 లక్షల వరకు రుణం, స్వదేశీ వస్తువులపై పన్ను మినహాయింపు ఇవ్వడం ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు, రైతులు, చేనేత కార్మికులకు కొంత ఊరట కల్పించినట్లయింది. – సాక్షి, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment