మహబూబ్‌నగర్‌ | - | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌

Published Sun, Feb 2 2025 1:40 AM | Last Updated on Sun, Feb 2 2025 1:40 AM

మహబూబ

మహబూబ్‌నగర్‌

ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

మ్మడి జిల్లాకు జీవనాడిగా మారే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం అందించాలన్న డిమాండ్‌ ఉండగా.. బడ్జెట్‌లో దీనిపై ప్రస్తావనే కరువైంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ పూర్తిచేయాల్సిన భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. అలాగే ఉమ్మడి పాలమూరులోని కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా నిరాశే ఎదురైంది. ఉమ్మడి జిల్లాలోని పురాతన, ప్రముఖ దేవాలయాలకు ప్రసాద్‌ స్కీం పథకం కింద కేంద్రం నుంచి నిధులు అందుతాయని ఆశించినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ నిధుల కేటాయింపు లేకుండాపోయింది.

సులభంగా రుణాలు..

వ్యవసాయ రంగంలో సాంకేతికత పెంచడం, వలసలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త నిర్ణయాలు తీసుకుంది. పంటల ఉత్పాదకత, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పంచాయతీ, బ్లాక్‌ స్థాయిల్లో గోదాంలు, నీటి పారుదల, రుణ సౌకర్యాలను మరింత పెంచాలని నిర్ణయించింది. అలాగే రైతుల పెట్టుబడి కోసం అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేయకుండా కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 5.50 లక్షలకుపైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో ఖర్చులు, పరికరాల కొనుగోలు కోసం రైతులు స్వల్పకాలిక రుణాలు పొందవచ్చు. రానున్న ఐదేళ్లపాటు పత్తి పంట ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం పత్తి పంట మద్దతు ధర పెంచేందుకు అవకాశం ఉంది.

చేనేత కార్మికులకు దన్ను..

ముఖ్యంగా మేక్‌ ఇన్‌ ఇండియా పథకంలో భాగంగా దేశంలో తయారైన స్వదేశీ దుస్తులకు పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలో ఉన్న మర మగ్గాల కార్మికులకు మేలు జరగనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 4,600 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. స్వదేశీ దుస్తులకు పన్ను మినహాయింపుతో చేనేత దుస్తుల ధరలు తగ్గనున్నాయి. కాగా.. పొగాకు, సిగరెట్లపై పన్నులను కేంద్రం పెంచడంతో వాటి ధరలు మరింత పెరగనున్నాయి.

ప్రధానికి కృతజ్ఞతలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ముమ్మాటికీ ప్రజా ఆమోద బడ్జెట్‌. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ప్రధానంగా ఆదాయపు పన్నులో రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం శుభపరిణామం. పారిశ్రామిక, ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ప్రజలకు అనుకూలంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రధాని మోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు. – డీకే అరుణ,

ఎంపీ, మహబూబ్‌నగర్‌

వినతులు బుట్టదాఖలు

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని, నిధులు కేటాయించాలని చేసిన మా వినతులు బుట్టదాఖలయ్యాయి. కనీసం మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరం. తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రజలు ఏటా రూ.లక్ష కోట్ల వరకు పన్నులు కడుతున్నారు. కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదు. – మల్లురవి, ఎంపీ, నాగర్‌కర్నూల్‌

ఉమ్మడి జిల్లాలోని సాగునీటిప్రాజెక్టులకు తప్పని భంగపాటు

పర్యాటక రంగ అభివృద్ధికిలభించని చేయూత

ఊసేలేని మాచర్ల– గద్వాల, కొత్త రైల్వే మార్గాలు

రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపుపై హర్షాతిరేకాలు

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో 5.50 లక్షల మంది

రైతులకు ప్రయోజనం

స్వదేశీ దుస్తులకు పన్ను తగ్గింపుతో 4,600 చేనేత కార్మికులకు మేలు

ఈసారి నిరాశే మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌

పాలమూరులో

ఊర్వశి రౌతేలా సందడి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాకేంద్రం క్లాక్‌టవర్‌ సెంటర్‌లో శనివారం సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ 39వ షోరూమ్‌ను ప్రముఖ సినీనటి, డాకు మహారాజ్‌ ఫేమ్‌ ఊర్వశి రౌతేలా ప్రారంభించారు. షోరూం అంతా తిరిగిన ఆమె పలు వస్త్రాలను పరిశీలించారు. హీరోయిన్‌ను చూసేందుకు షోరూం వద్ద జనం కిక్కిరిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు అభివాదం చేసి సినీ పాటలకు డాన్స్‌ చేస్తూ హోరెత్తించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌ పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్‌ సంస్థ డైరెక్టర్లు సురేశ్‌ సీర్ణ, అభినయ్‌, రాకేష్‌, కేశవ్‌ పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగం తర్వాత గ్రామీణాభివృద్ధికే అత్యధిక శాతం నిధులు కేటాయించింది. ఈ మేరకు మొత్తం రూ.2,66,817 కోట్ల కేటాయింపులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చించనుంది. దీంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి వేగంగా అడుగులు పడనున్నాయి. ఆ తర్వాత వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి విరివిగా రుణాలు మంజూరు చేయనున్నారు. అంగన్‌వాడీ పోషణ్‌ 2.0 ప్రాజెక్ట్‌ ద్వారా చిన్నారులకు పోషకాహారం పెంచడంతో పాటు మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. అన్ని జిల్లాకేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘డే కేర్‌ కేన్సర్‌ సెంటర్స్‌’ ఏర్పాటు చేయనున్నారు.

కరుణించని.. నిర్మలమ్మ

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
మహబూబ్‌నగర్‌1
1/6

మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌2
2/6

మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌3
3/6

మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌4
4/6

మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌5
5/6

మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌6
6/6

మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement