పీయూ అధ్యాపకుడికి డిజైన్ పేటెంట్ రైట్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఎంబీఏ విభాగ అధ్యాపకుడు అర్జున్‌కుమార్ స్టాక్ మార్కెట్ ప్రిడిక్టర్‌పై డిజైన్ విభాగంలో పేటెంట్ రైట్ పొందారు. ఈ మేరకు పరికరం రూపకల్పనలో మొత్తం ఆరుగురు అధ్యాపకులు పాల్గొన్నారని అర్జున్‌కుమార్ పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఐఏ ఆధారిత పరికరం అని, ఆర్థిక పరమైన వార్తలు, మార్కెట్ డేటా, సోషల్ మీడియా సెంటిమెంట్ వంటి అంశాలను విశ్లేషించి స్టాక్ మార్కెట్‌ను అంచనా వేస్తుందని, మెషిన్ లర్నింగ్, ఆల్గారి థం వంటి అంశాలను విశ్లేషిస్తుందన్నారు. మా ర్కెట్ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది అంచనాలు, సిఫార్సులను చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పేటెంట్ రైట్‌ను సాధించిన వారిని ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, కుమారస్వామి, నాగసుధ, రవికుమార్, గాలెన్న, చంద్రశేఖర్, సుదర్శన్‌రెడ్డి, జిమ్మికార్టన్, వెంకటరాఘవేందర్ పాల్గొన్నారు.
గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: రథసప్తమిని పురస్కరించుకొని ఈ నెల 3 నుంచి 5 వరకు గంగాపురం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 15 ప్రత్యేక బస్సుల ద్వారా దాదాపు 150 అదనపు ట్రిపులను మహబూబ్‌నగర్ డిపో నుంచి గంగాపురం జాతరకు నడుపుతామని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలో సౌరశక్తిఉత్పత్తికి అవకాశం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో సౌరశక్తి ఉత్పత్తి చేసి ఆదాయం పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేష్ తెలిపారు. 4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుదుత్పత్తి లక్ష్యంలో భాగంగా జిల్లాలోని రైతులు తమ బంజరు, వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు 5 కి.మీ., పరిధిలో ఉన్న భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగా వాట్ల వరకు ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ నిర్ణయించిన టారిఫ్ ప్రకారం ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేస్తాయన్నారు. ఇందుకోసం ఆసక్తి గలవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment