రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఇళ్లు..
గ్రామ, వార్డు సభలకు పోటెత్తిన దరఖాస్తుదారులు
వివరాలు 8లో u
మహబూబ్‌నగర్: రేషన్ కార్డులకు 2,340 దరఖాస్తులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 49 వార్డులు ఉండగా.. తొలి రోజు 12 వార్డుల్లో సభలు జరిగాయి. రేషన్‌కార్డుల కోసం 1,716, ఇందిరమ్మ ఇళ్ల కోసం 885 దరఖాస్తులు వచ్చాయి. రైతు భరోసా కోసం ఆరు, ఆత్మీయ భరోసాకు ఐదు దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడా మండలాల్లోని 17 పల్లెల్లో గ్రామ సభలు జరగ్గా.. రేషన్ కార్డుల కోసం 624, ఇందిరమ్మ ఇళ్లకు 101, ఆత్మీయ భరోసాకు 11, రైతు భరోసా కోసం 10 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలో తొలి రోజు దరఖాస్తులు ఇలా..
రైతు భరోసా
123
ఇందిరమ్మ ఇళ్లు
3,557
ఆత్మీయ భరోసా
446
రేషన్‌కార్డులు
6,096
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రాములు. నవాబ్‌పేట మండలం కూచూర్ గ్రామానికి చెందిన ఆయనకు ఇద్దరు కుమారులు కాగా.. వారికి పెళ్లిళ్లు అయి ఐదేళ్లు గడిచింది. తన కుమారుల రేషన్‌కార్డుల కోసం మంగళవారం నిర్వహించిన గ్రామసభకు వచ్చాడు. అధికారులు వెల్లడించిన జాబితాలో వారి పేర్లు రాకపోవడంతో అధికారులను నిలదీశాడు. వారు మళ్లీ దరఖాస్తు చేసుకోమని సర్దిచెప్పడంతో రాములు వెనుదిరిగాడు.
కలెక్టర్ స్వీయ పర్యవేక్షణ..
గ్రామసభల తొలిరోజు కలెక్టర్ విజయేందిర బోయి జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి, మూసాపేట మండలం చక్రాపూర్, మహబూబ్‌నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొని స్వయంగా పర్యవేక్షించారు. జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో భాగస్వామ్యులయ్యారు.
నా పేరు లేదు.. అడిగితే పైనుంచి వచ్చిందంటున్నారు..
సొంత ఇల్లు లేకపోవడంతో నాలుగేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. నెలనెలా రూ.1,200 అద్దె చెల్లిస్తున్నాం. కొడుకు, కోడలుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇల్లు లేకపోవడంతో అత్తామామ పొలం దగ్గర రేకులు వేసుకుని నివాసం ఉంటున్నారు. ప్రజాపాలనలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నా.. జాబితాలో పేరు రాలేదు. అధికారులను అడిగితే పైనుంచి వచ్చిందని.. మాకేమీ తెలియదంటున్నారు. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో మళ్లీ ఇచ్చాను.
– సంపల్లి అమృతమ్మ, కొమిరెడ్డిపల్లి, గండేడ్
8 ఏళ్లుగా రేషన్‌కార్డు లేదు.. ఈ జాబితాలోనూ పేరు లేదు..
నాకు, ఇంకో తమ్ముడికి పెళ్లి అయింది. నా చిన్న తమ్ముడు పెళ్లీడుకొచ్చాడు. మేమందరం తల్లిదండ్రులతో కలిసి అందరం ఒకే ఇంటిలో ఉమ్మడిగా ఉంటున్నాం. అందరం ఒకే ఇంట్లో ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎనిమిదేళ్లుగా రేషన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నాం. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నాం. తాజాగా ప్రకటించిన జాబితాలో మా పేరు లేదు. ఇల్లు కూడా మంజూరు కాలేదు. ప్రశ్నిస్తే మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారు. – రవి, టంకర, హన్వాడ
జడ్చర్ల: ఇందిరమ్మ ఇళ్లకు 1,922..
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది వార్డుల్లో సభలు జరిగాయి. రేషన్ కార్డులకు 552, ఇందిరమ్మ ఇళ్లకు 186 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా నవాబ్‌పేట, రాజాపూర్, మిడ్జిల్, జడ్చర్ల, బాలానగర్ మండలాల్లో 48 పల్లెల్లో గ్రామసభలు నిర్వహించగా.. ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,736, రేషన్‌కార్డులకు 1,470, ఆత్మీయ భరోసాకు 131, రైతు భరోసా కోసం 34 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నవాబ్‌పేట మండలం కూచూర్‌లో ఆత్మీయ భరోసా కోసం దాదాపు 100 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే.. ఒక్కరి పేరు మాత్రమే జాబితాలో రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
●
Comments
Please login to add a commentAdd a comment