విద్యుత్ షాక్‌తో రైతు మృతి
మామడ: పంటకు నీరందించేందుకు వెళ్లిన రైతును మృత్యువు విద్యుత్‌షాక్ రూపంలో కబళించింది. ఈ ఘటన మా మడలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన రైతు రెడ్డి చిన్నభీమన్న(46) తాను సాగు చేస ్తున్న పసుపు పంటకు నీరందించేందుకు బుధవారం వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామస్తులతో కలిసి రాత్రి చేను వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యుత్ స్తంభానికి ఉన్న సర్వీస్ వైరును సరిచేస్తుండగా షాక్‌కుగురై మృతిచెందినట్లు భావించారు. దీపావళి పండుగవేళ యజమాని మృతిచెందడతో విషాదం నెలకొంది. ఘటన స్థలాన్ని ఎస్సై సందీప్ సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పిడుగుపడి మహిళ మృతి
దండేపల్లి: మండలంలోని ద మ్మన్నపేట గ్రామానికి చెందిన గడ్డం నాగమ్మ(26) గురువా రం పిడుగుపాటుకు మృతిచెందింది. ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలి పిన వివరాల ప్రకారం.. నా గమ్మ గ్రామ శివారులోని పత్తి చేనులో పనికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో వర్షం కురిసి పిడుగు పడింది. చేనులోనే కొద్ది దూరంలో పని చేస్తున్న ఆమె భర్త ప్రశాంత్ గమనించి గ్రామ శివారు వరకు ఎత్తుకొచ్చాడు. అక్కడి నుంచి 108అంబులెన్స్‌లో మేదరిపేటకు ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment