కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ
● ఎమ్మెల్యే వివేక్ ముందే తోపులాట ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జైపూర్: మండల కేంద్రంలోని ఇందారంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ముందే కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగారు. బుధవారం డీఎంఎఫ్టీ నిధులతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై మండల అధ్యక్షుడు ఫయాజ్ కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యేను ఆహ్వానించారని జక్కుల వెంకటేశం ఎమ్మెల్యే వివేక్‌కు ఫిర్యా దు చేశారు. ఫయాజ్ స్పందిస్తూ తనపై వ్యక్తిగతంగా కక్షగట్టి గొడవ సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ద్వారా సమాచారం పంపించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు దూషించుకుంటూ తోపులాటకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ గొడవతో అసహనానికి గురైన ఎమ్మెల్యే గ్రామంలోని ఎస్సీ కాలనీలో మరో కార్యక్రమంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. అంతకుముందే నర్వ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment