108, 102లో ఉద్యోగ నియామకాలు
మంచిర్యాలటౌన్: ఈఎంఆర్ఐజీహెచ్ఎస్(108, 102) సంస్థలో పైలెట్(డ్రైవర్) ఉద్యోగ నియామకాల కోసం ఈ నెల 13, 14వ తేదీ ల్లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ బి.సామ్రాట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ సెట్‌తో హాజరు కావాలని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులు, బ్యాడ్జి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులని తెలిపారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలోని 108 జిల్లా కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని, వివరాలకు 9849237102 నంబరులో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment