గ్రూప్–3 పరీక్ష సమర్థవంతంగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 17, 18న గ్రూప్–3 పరీక్ష సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరీక్ష ముఖ్య పర్యవేక్షకులు, పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బందిని నియమించామని అన్నారు. 17న ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30గంటల వరకు, 18న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరాకు అధికారులు పర్యవేక్షించాలని, తాగునీటి వసతి కల్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, హాజరు పట్టికలు, ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను పరిశీలకులు పర్యవేక్షించాలని తెలిపారు. డీసీపీ ఏ.భాస్కర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, సామగ్రిని పోలీసు బందోబస్తు మధ్య తరలిస్తామని అన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపలి ఏఆర్ ఏసీపీ సుందర్, డీఈవో యాదయ్య, రూట్ అధికారులు పాల్గొన్నారు.
సర్వే వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి
నస్పూర్: పట్టణంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి సర్వేను స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 13, 17వ వార్డులో సర్వేను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని అన్నారు. నమూనాలో ఉన్న అన్ని అంశాలను పూరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోట శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment