వైద్యుల వివరాల బోర్డు ఏర్పాటు చేయాలి
● డీఎంహెచ్‌వో హరీష్‌రాజు ● పీహెచ్‌సీల్లో వైద్య సేవలపై సమీక్ష
బెల్లంపల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది వివరాలు తెలిసే విధంగా బోర్డులు ఏర్పా టు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ హరీష్ రాజు ఆదేశించారు. మంగళవారం బెల్లంపల్లి ప్రభు త్వ ఏరియా ఆసుపత్రిలో తాండూర్, తాళ్లగురిజాల, నెన్నెల పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది పనితీరు, వెద్యసేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందుల నిల్వ, సిటిజన్ చార్టర్ ప్రదర్శించాలని అన్నారు. రో గులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయొద్ద ని, సమయపాలన పాటిస్తూ రోజూ విధులకు హా జరు కావాలని తెలిపారు. వ్యాధుల నియంత్రణ కోసం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల ని ఆదేశించారు. వైద్యులు ఉపకేంద్రాలను సందర్శించాలని అన్నారు. మాతాశిశు సంరక్షణలో భా గంగా హైరిస్క్ గర్భిణులను జిల్లా ఆసుపత్రి మాతా శిశు కేంద్రానికి తరలించాలని తెలిపారు. ఈ సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ సుధాకర్‌నాయక్, డాక్టర్ అనిత, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ సీతా రామారాజు, డీపీవో ప్రశాంతి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, ఎస్‌ఓ కాంతారావు, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment