అక్రమ కట్టడాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాల కూల్చివేత

Published Tue, Nov 19 2024 12:11 AM | Last Updated on Tue, Nov 19 2024 12:11 AM

అక్రమ కట్టడాల కూల్చివేత

అక్రమ కట్టడాల కూల్చివేత

నస్పూర్‌: నస్పూర్‌ పట్టణ పరిధిలోని కొత్త చె రువు శిఖం భూమిలో అక్రమంగా వెలిసిన ప లు షెడ్లు, ఫెన్సింగ్‌ను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు జేసీ బీ సహాయంతో సోమవారం సాయంత్రం తొలగింపజేశారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సతీష్‌ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్ట ణ పరిధిలోని చెరువు శిఖం, అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్లోని అక్రమ కట్టడాలు తొలగిస్తున్నామని తెలిపారు. ఆక్రమణల తొలగింపు మరి కొద్దిరోజులపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఓ యశ్వంత్‌, ఆర్‌ఐ మాంతయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భూములు అమ్మిన వారి

వద్దకు బాధితులు

నస్పూర్‌ శివారు సర్వేనంబర్‌ 64 అసైన్డ్‌ భూ మిలో భూములు కొనుగోలు చేసి షెడ్లు, ఫెన్సింగ్‌ ఏర్పా టు చేసుకున్న పలువురు బాధితులు తాము గతంలో కొనుగోలు చేసిన వారి వద్దకు పరుగులు తీశారు. అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పి రూ.లక్షలు తీసుకుని భూములు అమ్మారని తెలిపారు. చెరువు శిఖం, ప్రభుత్వ అసైన్డ్‌ భూములని అధికారులు చెబుతున్నారని వాపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement