కోర్ గ్రామాల తరలింపు ఏళ్లుగా సాగుతోంది. గ్రామస్తుల అంగీకారానికి మొదట జాప్యం జరుగుతుండగా, వారికి పునరావాస ప్యాకేజీ అందడంలోనూ జాప్యం జరుగుతోంది. ఒకసారి గ్రా మస్తులు అంగీకారం తెలిపి తీర్మానం అందజేశా క కూడా ఏళ్లు గడుస్తున్నాయి. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రా ష్ట్రాల నిధుల విడుదలలోనూ జాప్యం జరుగుతోంది. ఇక తరలించేటప్పుడు ఇచ్చిన హామీలు తర్వాత అమలవుతాయో లేదో అనే భయం కూ డా గిరిజనుల్లో నెలకొంది. దీంతో అంగీకారం ఇచ్చేందుకు గిరిజనులు ఇష్టపడడం లేదు. ఏళ్లుగా తమ ఇల్లు, వాకిలి, అడవి, తమ దేవుళ్లు, సంస్కృతి, సంప్రదాయాలు నెలకొన్న ఆ ప్రాంతాన్ని వదిలి రావడానికి పాత తరం వారు చాలావరకు ఒప్పుకోవడం లేదు. అటవీ లోపల ఉన్న ఆవాసాలతో అటు వన్యప్రాణులకు ఇటు గిరిజనులకు కనీస అవసరాలకు నోచుకోకుండా విద్య, వైద్యం, ఉపాధి అనేక వసతులకు దూరంగా ఉంటున్నారు. మైదాన ప్రాంతానికి తరలిస్తే తమ కుటుంబాలు బాగుపడుతాయనే భావన కూడా కొందరిలో ఉంది. దీంతో భావితరాల భవిష్యత్ కోసం తప్పక ఒప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment