కుటుంబంతో గడపలేక పోతున్నాం..
పోలీస్ ఉద్యోగమంటే సమాజంలో మంచి గౌరవం ఉంటుందని చేరిన. గౌరవం మాత్రమే ఉంది. బంధువులు పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్దామంటే సెలవులు దొరుకవు. కనీసం భార్యాపిల్లలతోనా ఆనందంగా గడిపేందుకు సమయం దొరకది. నైట్ పెట్రోలింగ్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత పిలుపు వచ్చిందంటే ఉరుకాల్సిందే.
– పట్టణంలోని ఓ ఎస్సై
అనారోగ్యానికి గురైనా విధులు
పోలీస్ ఉద్యోగం అంటే కత్తిమీద సామే. అందులో మహిళలు పోలీస్ ఉద్యోగం చేయడమంటే సాహసమే అవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కొన్ని సందర్భాల్లో అత్యవసర సమయంలో, అనారోగ్యానికి గురైన విధులు నిర్వర్తించాల్సిందే. ఇంట్లో వంట పని, కుటుంబం, భర్త, పిల్లలు అన్ని చూసుకోవాలి. పైగా ఉన్నతాధికారుల ఒత్తిడిని తట్టుకొని విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
– జిల్లాలో పని చేస్తున్న ఓ మహిళా ఎస్సై
వ్యక్తిగత అవసరాలకు
సెలవులు ఇస్తున్నాం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి వ్యక్తిగతంగా అవసరం ఉందంటే సెలవులు ఇస్తున్నాం. విధుల్లో సైతం ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు. సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. గతంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. ఇటీవల కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబు ళ్లు విధుల్లో చేరనున్నారు. సిబ్బంది సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల పని ఒత్తిడి తగ్గుతోంది.
– ఎం.శ్రీనివాసులు,
రామగుండం పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment