పొరపాట్లు లేకుండా నమోదు చేయాలి
● నిర్లక్ష్యం వహించవద్దు ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే ప్రక్రియలో ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, ముఖ్య ప్రణాళిక అధికారి మహ్మద్ ఖాసీం, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావులతో కలిసి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సర్వేలో ఎన్యుమరేటర్లు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారని, ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో నమో దు చేయాలని తెలిపారు. జిల్లాలో 562 మంది డా టా ఎంట్రీ ఆపరేటర్లను నియమించామని, ఒక్కొక్కరికి 300 కుటుంబాల సమాచారం అందించామ ని, ఒక రోజులో కనీసం 30 కుటుంబాలకు తగ్గకుండా పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపా రు. డిసెంబర్ ఒకటిలోగా వివరాలు నమోదు పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని అన్నా రు. వివరాలు గోప్యంగా ఉంచాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు నమోదు తీరును వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment