ధాన్యంలో తాలు ఉండకూడదు
దండేపల్లి: కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యంలో తాలు, తప్పా ఉండకూడదని, తేమ శాతం 17లోపు ఉండేలా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మండల కేంద్రమైన దండేపల్లితోపాటు ముత్యంపేట, గూడెం, కన్నెపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. నిర్వాహకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డురకాలను వేర్వేరుగా కొనుగోలు చేయాలని, సన్నరకం ధాన్యాన్ని గుర్తించి ధ్రువీకరించే బాధ్యత వ్యవసాయ అధికారులదేనని అన్నారు. అనంతరం దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేశారు. ధరణి దరఖాస్తుల పెండింగ్ వివరాలపై ఆరా తీశారు. దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వ్యాధుల తీవ్రత, మందులపై అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో నిర్మాణంలో ఉన్న డార్మెటరీ హాల్‌ను పరిశీలించారు. తహసీల్దార్ సంధ్యారాణి, డీటీ విజయ, ఆర్‌ఐ భూమన్న, ఏవో అంజిత్‌కుమార్, ఏపీఎం బ్రహ్మయ్య, ఏఈవోలు అర్చన, మౌనిక, సీసీ కొమురవెల్లి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment