పఠనంపై ఆసక్తికి రూమ్ టు రీడ్
మంచిర్యాలఅర్బన్: ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదవడంపై ఆసక్తి పెంపొందించటం.. స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దడానికి రూమ్ టు రీడ్ ఎంతో దోహదం చేస్తుందని డీఈవో యాదయ్య అన్నా రు. శుక్రవారం రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ సెరీ కార్యక్రమం ఎఫ్‌ఎల్‌ఎన్‌కు అనుబంధంగా గర్మిళ్ల పాఠశాలలో ఏర్పాటు చేసి మోడల్ లైబ్రరీని ప్రారంభించారు. లైబ్రరీలో వివిధ రకాల కథల పుస్తకాలు, పిల్లల ఆలోచన పరిధిని పెంచే విషయ పరిజ్ఞానం కలిగిన పుస్తకాలు పొందుపర్చారని తెలిపారు. పుస్తకాల ప్రదర్శనకు వీలుగా ఓపెన్‌రాక్స్, జ్యూట్ బ్యాగ్, పినప్‌బోర్డు, కార్పెట్స్, రీడింగ్ టేబుల్, పిల్ల లకు అవసరమైన స్టేషనరీ అందుబాటులో ఉంచా రు. ఎంఈవో మాళవిదేవి, జెడ్పీఎస్‌ఎస్ గ్లర్స్ ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, జెడ్పీఎస్‌ఎస్ గర్మిళ్ల ప్రధానోపాధ్యాయుడు భీంరావు, పాఠశాల హెచ్‌ఎం పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment