‘విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండల, గ్రామాల్లోని పంచాయతీ అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) వెంకటేశ్వర్‌రావు హెచ్చరించారు. శక్రవారం డీపీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, పారిశుద్ధ్య పనుల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సెగ్రిగేషన్ షెడ్‌లలో తడి, పొడి చెత్త వేరు చేసి కాంపోస్ట్ తయారు చేసేలా చూడాలని, నర్సరీల్లో మొక్కల పెంపకం, సంరక్షణ విధిగా జరగాలని, నీటి సరఫరా రిజిష్టర్ల నిర్వహణ విధిగా ఉండాలని అన్నారు. 26న ఓటరు జాబితాను స్థానికంగా ఆయా పార్టీల నాయకుల సమన్వయంతో పూర్తి చేయాలని, 26న గ్రామాల్లో పనుల జాతరకు సమాయత్తం కావాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment