మామిడిగూడెంలో వైద్యశిబిరం
కాసిపేట: మండలంలోని మామిడిగూడెంలో వైద్యులు శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ‘మంచం పట్టిన మామిడిగూడెం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ భోజన్న ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి రవికిరణ్, వైద్యుల బృందం ఉదయమే గ్రామానికి చేరుకుంది. గ్రామంలో క్లోరినేషన్ నిర్వహించి అందరికీ వైద్య పరీక్షలు చేసి కొందరి రక్త నమూనాలు సేకరించారు. కొందరికే జ్వరాలు ఉన్నాయని, ఎక్కువ మంది ఒళ్లునొప్పులు, అలసటతో బాధపడుతున్నారని తెలిపారు. మురికి కాలువలు నిండి దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. వైద్యాధికారి రవికిరణ్ సూచన మేరకు ఎంపీడీవో పారిశుద్ధ్య పనులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి కాలువలు శుభ్రం చేశారు. వైద్య శిబిరాన్ని సాయంత్రం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి హరీష్‌రాజ్ పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలని, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్, డీఈఏంవో వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఏంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment