దారి దోపిడీకి యత్నం
● ప్రతిఘటించిన బాధితుడు.. దొంగలు పరార్ ● బాధితుడికి కత్తి గాయాలు ● త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
గుడిహత్నూర్: దారిలో దోపిడీకి ప్రయత్నించిన దొంగలు బాధితుడు ధైర్యంగా ప్రతిఘటించడంతో పరార్ అయ్యారు. మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఈఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన బండి సురేశ్ స్థానిక వైన్స్‌షాపులో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగా బుధవారం రాత్రి 9 గంటల అనంతరం వైన్స్ షాపు మూవేసి సహచర ఉద్యోగి రాజుతో వేర్వేరు బైక్‌లపై ఇంటికి బయల్దేరారు. అప్పటికే సురేశ్‌ను నలుగురు దొంగలు రెండు స్కూటీలపై అనుసరించారు. శివాలయం వెనుక చీకటిగా ఉన్న జాతీయ రహదారి వద్ద ఒక్కసారిగా సురేశ్ బైక్‌ను ఢీకొట్టారు. కంట్లో కారం చల్లి మెడకు కత్తి పెట్టి నగదు బ్యాగు లాక్కునే ప్రయత్నం చేశారు. తీవ్రంగా ప్రతిఘటిస్తూ గట్టిగా అరవడంతో ముందు వెళ్తున్న రాజు బైక్‌ను వెనుకకు రావడంతో దొంగలు కత్తితో సురేశ్‌ను గాయపర్చి పరారయ్యారు. తీవ్రగాయాలైన అతడు ఎస్సై మహేందర్‌కు జరిగిన విషయాన్ని వివరించారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా, సురేశ్ బ్యాగులో రూ.3 లక్షల నగదు ఉంది. దోపిడీకి యత్నించిన వారంతా యువకులేనని బాధితుడు తెలిపాడు. రాజు వెనకకు రావడంతో సురేశ్‌కు ప్రాణప్రాయం తప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment