రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ లక్ష్యం
● సీపీఐ జాతీయ సభ్యుడు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్‌రెడ్డి
పాతమంచిర్యాల: భారత రాజ్యాంగాన్ని మార్చడమే ఏకై క లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని సీపీఐ జాతీయ సభ్యుడు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామసుధ రెసిడెన్సీలో సీపీఐ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పని చేస్తోందని, హిందూయిజం, మతోన్మాదాలతో దేశాన్ని పాలించాలని చూస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టులను అభివృద్ధి నిరోధకులు అంటూ ప్రజలకు దూరం చేయాలని చూస్తోందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘ సేవ ముసుగులో రాజకీయ పార్టీ కాదంటూ మతోన్మాదంతో ముందుకు వెళ్తోందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలతో పని చేస్తున్న సంఘ్ పరివార్ శక్తులు ఏ పార్టీకి సంబంధం లేదంటూనే బీజేపీ వ్యతిరేక పార్టీలను నాశనం చేస్తోందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణకు దేశంలోని కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీలు కలిసి ఒక్కటిగా ముందుకు నడవాలని తెలిపారు. కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మేకల దాసు, ఖలిందర్‌ఖాన్, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్, బొల్లం పూర్ణిమ,చిప్ప నర్సయ్య, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్, కారుకూరి నాగేష్, ఇప్పకాయల లింగయ్య, ముస్కె సమ్మయ్య, బాజీసైదా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment