ఇందిరమ్మ మోడల్ ఇంటికి భూమిపూజ
మందమర్రిరూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణానికి భూ మి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని అన్నారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల సర్వే జాబితా ను అధికారులు ప్రకటిస్తున్నారని, ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని, ఆ జాబితాల్లో పేర్లు రాని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో రాజేశ్వర్, తహసీల్దార్ సతీష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment