పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు అందజేత
మంచిర్యాలక్రైం: సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి 200మందికి సెల్‌ఫోన్లను రామగుండం సీపీ శ్రీని వాస్ బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడు తూ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 5,280 మంది ఫిర్యాదు చేయగా.. 200 సెల్‌ఫోన్లను గుర్తించామని తెలిపారు. సెల్‌ఫోన్ల రికవరీకి సీసీఎస్‌తో పాటు ప్రతీ పోలీసుస్టేషన్ పరిధిలో ప్రత్యేక విభా గం ఏర్పాటు చేశామని అన్నారు. మొబైల్‌ను పో గొట్టుకున్న వారు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, సీసీఎస్ సీఐ కమలాకర్, ఐటీసెల్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలపై
అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలక్రైం: మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌ల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రిప్టో కరెన్సీ, ఆగ్రో గార్మెంట్స్ హెర్బల్ అండ్ హెల్త్, గృహా పరికరాల వంటి వాటిపైన పెట్టుబడులు పెట్టి అధిక మొత్తంలో లాభాలు గడించవచ్చని నమ్మించి ప్రజల డబ్బులు దోచేస్తున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని భావిస్తే తక్షణమే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment