అర్హులైన ప్రతి ఇంటా సంక్షేమ పథకాలు
● బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి: అర్హులైన ప్రతి ఇంటా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం పట్టణంలోని 22వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో వారు మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రైతుభరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ జ్యోత్స్న, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్వేత, కమిషనర్ కే.శ్రీనివాసరావు, మాజీ చైర్‌పర్సన్ మునిమంద స్వరూప పాల్గొన్నారు.
పేదలకు అందేలా కృషి
బెల్లంపల్లి: ప్రజా సంక్షేమ పథకాలు పేదలందరికీ అందేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. బుధవారం ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5909 మంది, రైతు భరోసాకు 51,534, రేషన్‌కార్డులకు 5,883, ఇందిరమ్మ ఇళ్లకు 39,517 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. అర్హుల జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దని, గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు మునిమంద రమేష్, నాతరి స్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment