హవేళిఘణాపూర్(మెదక్): అమ్మవారికి కుటుంబసభ్యులు పూజలు చేయలేదని మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శమ్నాపూర్ గ్రామానికి చెందిన దుర్గమ్మ(70) గురువారం రాత్రి తనకు తీవ్ర తలనొప్పి వస్తుందని చెప్పగా కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రికి తీసుకెళ్తామన్నారు.
తాను దుర్గమ్మకు పూజలు చేయాలని చెప్పినా ఒక్కరూ కూడా చెవికెక్కించుకోవడం లేదని మనస్తాపం చెందింది. దీంతో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటికి పక్కనున్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కోసం ఇంట్లో, బయట వెతుకుతుండగా బావిలో మృతదేహాన్ని గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment