కాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం

Published Wed, May 8 2024 10:00 AM

కాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం

● బీఆర్‌ఎస్‌, బీజేపీల మాటలు నమ్మొద్దు ● దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌ చేస్తాం ● పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

దుబ్బాక: ప్రజలకు న్యాయం చేసేది కాంగ్రెస్సేనని, బీఆర్‌ఎస్‌, బీజేపీలను నమ్మొద్దని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్‌ మీటింగ్‌లో జగ్గారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అని, ప్రజలను మోసం చే సింది బీఆర్‌ఎస్‌ అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌రావు ఇక్కడికి రైలు తెచ్చిండా అన్నారు. నీలం మధును గెలిపిస్తే చెరుకు శ్రీనన్నను తీసుకొని సీఎం దగ్గరికి వెళ్లి, దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ను చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాకను అభివృద్ధి చేసిన ఘనత చెరుకు ముత్యంరెడ్డిదే అన్నారు.

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం దివాలా..

కేసీఆర్‌ తెలంగాణను దోచుకొని.. పూర్తిగా దివాలాతీయించారని జగ్గారెడ్డి మండిపడ్డారు. రైతులకిచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోపు సీఎం రేవంత్‌రెడ్డి చేసి తీరుతారన్నారు. కేసీఆర్‌ చేసిన పాపం ఊరికే పోదని, వడ్డీతో సహా కక్కాల్సిందేనన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు తెచ్చి కార్మికుల కడుపులు కొట్టిన బీజేపీకి బుద్ది చెప్పాలన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement