
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో పెళ్లి తర్వాత నయనతారలో మార్పు మొదలైనట్లు తెలుస్తోంది. సినిమాల విషయంలో దర్శకనిర్మాతలకు ఆమె కొత్త కండీషన్స్ పెడుతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై తనని సంప్రదించబోయే దర్శకనిర్మాతలు గ్లామర్ రోల్స్ కోసం కాకుండా ఉమెన్ సెంట్రిక్ మూవీస్‌తో తన దగ్గరికి రావాలన్నట్లు నయన్ కండీషన్ పెట్టిందట.
(చదవండి: బొట్టు పెట్టి..చేతిలో చీరపెట్టారు.. సాయి పల్లవి ఎమోషనల్)
నిజానికి కొంత కాలంగా నయన్ గ్లామర్స్ రోల్స్ దూరంగా ఉంటోంది. స్టార్ హీరోలతో నటిస్తున్న మూవీస్ లో సైతం నయన్ కొన్ని లిమిట్స్ పెట్టుకుని నటించింది.ఎక్కువ శాతం ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కాకపోయినా సెలక్టెడ్ గా మూవీస్ చేయాలనుకుంటోంది నయన్. ప్రస్తుతం నయన్ చేతిలో తెలుగు,తమిళ,హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటికి మాత్రం ఎలాంటి అబ్జెక్షన్ లేదని నయన్ తెలిపినట్లు సమాచారం. ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై మాత్రమే కండీషన్స్ అప్లై అంటోందట లేడీ సూపర్ స్టార్. ప్రస్తుతం నయన్ షారుఖ్ ఖాన్ తో జవాన్ లో నటిస్తోంది. అలాగే గాడ్ ఫాదర్ లోచిరుతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment