![Amith Starrer 1000 Wala Movie Pre Release Event Highlights](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/1000wala.jpg.webp?itok=r23se6Yi)
అమిత్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 1000వాలా. సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు అఫ్జల్ డైరెక్ట్ చేస్తుండగా సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నాడు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో సుమన్ ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక యంగ్ టీం చేయడం ఈ సినిమా చేయడం చాలా ఉత్సాహన్నిచ్చింది. షూటింగ్ లోకేషన్‌లో వీళ్ళ టీం వర్క్ చూసి చాలా ముచ్చటేసింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో అమిత్ మాట్లాడుతూ.. హీరో అవ్వాలనేది నా 10 ఏళ్ల కల. ఎన్నో కష్టాలు చూశాను. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. తిండి తినకుండా ప్రయత్నాలు చేశా, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. డైరెక్టర్ అఫ్జల్, నిర్మాత షారుఖ్ వల్ల ఈ సినిమా మొదలు పెట్టాం, చాలా బాగా వచ్చింది అన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment