బిగ్‌బాస్‌: అరియానాను టార్గెట్ చేస్తున్న నెటిజ‌న్లు | Bigg Boss 4 Telugu: Ariyana Gets Trolled For Not Doing Any Work | Sakshi
Sakshi News home page

శ‌భాష్‌ అరియానా, నీకో న్యాయం, ఎదుటోడికో న్యాయం

Published Sat, Nov 7 2020 4:18 PM | Last Updated on Sat, Nov 7 2020 6:20 PM

Bigg Boss 4 Telugu: Ariyana Gets Trolled For Not Doing Any Work - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అంద‌రిక‌న్నా ఎక్కువ క్లారిటీ అరియానా గ్లోరీకే ఉంద‌న్న భ్ర‌మ‌లు ఇప్పుడిప్పుడే తొల‌గిపోతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడుతూ, త‌న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండే ఈ బోల్డ్ బ్యూటీ అమ్మ రాజ‌శేఖ‌ర్ మాయ‌లో ప‌డింది. ఏ ప‌నీ చేయ‌కుండా ఆయ‌నకు అసిస్టెంటుగా మారి ప‌రువు పోగొట్టుకుంటోంది. ఇదే అరియానా గ‌తంలో కెప్టెన్సీకి పోటీ ప‌డిన‌ప్పుడు ఓ మాట అంది. ఏ ప‌నీ అప్ప‌జెప్ప‌క‌పోతే సపోర్ట్ చేస్తాన‌ని అభిజిత్ డీల్ మాట్లాడ‌గా.. తాను కెప్టెన్ అవ‌క‌పోయినా ప‌ర్లేదు కానీ అలా ప‌ని చేయ‌కుండా కూర్చుంటే నేను ఒప్పుకోను, ప్ర‌తీ హౌస్‌మేట్ ప‌ని చేసి తీరాల్సిందే అని క‌రాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో ఆమెను అభిమానులు ఆకాశానికెత్తారు. కానీ అవ‌న్నీ నీటి మీద రాత‌లేన‌ని తేలిపోయాయి. మొన్న‌టికి మొన్న అరియానా-అవినాష్ జంట గురించి చెప్ప‌మ‌న్న‌ప్పుడు సోహైల్‌, మెహ‌బూబ్ అరియానా ఏ ప‌నీ చేయ‌దు అని, బ‌ద్ధ‌క‌స్తురాలు అని చెప్పిన విష‌యం తెలిసిందే క‌దా. ఇప్పుడు అదే నిజ‌మైంది. 

అంద‌రూ ప‌ని చేయాలి;  కానీ త‌ను కాదు
కెప్టెన్‌గా అమ్మ రాజ‌శేఖ‌ర్ హౌస్‌లో హిట్ల‌ర్ నిబంధ‌న‌లు పెడుతున్నాడు. అంద‌రికీ స‌మానంగా ప‌నులు అప్ప‌జెప్ప‌కుండా త‌న ఈగో తృప్తిప‌రుచుకునేందుకు కొంద‌రి నెత్తిన అద‌న‌పు భారం వేస్తూ త‌న మాటే శాస‌నమ‌ని ఆదేశాలు జారీ చేస్తున్నాడు. త‌ప్పు జ‌రిగితే మాట్లాడ‌తాను అని చెప్పే అరియానా మాస్ట‌ర్ తీరును ఎండ‌గ‌ట్టాల్సింది పోయి అందుకు సంతోషించ‌డం అంద‌రినీ నోరెళ్ల‌బెట్టేలా చేసింది. ఆమెను అసిస్టెంట్‌గా నియ‌మించ‌గానే అందుకు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌కుండా గొర్రెలా త‌లూప‌డం మ‌రీ విడ్డూరంగా అనిపించింది. ఇక ఇంట్లో కూడా చిన్న చిన్న విష‌యాల‌ను భూత‌ద్దంలో పెట్టి చూస్తూ పెద్ద పెద్ద‌గా అర‌వ‌డం కూడా చికాకు పుట్టిస్తోంది.(చ‌ద‌వండి: అభిజిత్‌కు అన్యాయం చేసిన అరియానా)

త‌న‌కు స‌పోర్ట్ చేసిన హారిక‌కు ఏమిచ్చింది?
కాగా అమ్మాయే కెప్టెన్ అవాల‌నుంద‌ని హారిక గ‌త‌సారి అరియానాకు స‌పోర్ట్ చేసింది. ఆ విష‌యాన్ని లెక్క‌లోకి తీసుకుందో లేదో కానీ కెప్టెన్సీ పోటీకి మాత్రం ఆమెకు స‌పోర్ట్ చేయ‌డం కాదు క‌దా త‌నే మ‌రోసారి కెప్టెన్ అవాల‌ని క‌ల‌లు కంది. అనుకున్న‌ట్లుగానే పోటీకి దిగింది. వెర‌సి.. కెప్టెన్సీ ప‌వ‌ర్‌ను త‌న‌కు ద‌క్కుండా, వేరొక‌రికి ద‌క్క‌నీయ‌కుండా అమ్మ రాజ‌శేఖ‌ర్ వ‌శం చేసింది. ఇప్పుడు ఆయ‌న ఏ ప‌నీ చేయ‌కుండా కూర్చో అన‌గానే కీలుబొమ్మ‌లా త‌లాడించింది. (చ‌ద‌వండి: న‌ర‌కం చూపించిన ఆ ఇద్ద‌రే బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్లు)

మాస్ట‌ర్ వ‌ల్లే అరియానాపై నెగెటివిటీ!
దీంతో అరియానా వైఖ‌రిపై నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అర‌టి తొక్క‌, డ‌స్ట్‌బిన్ క‌వ‌ర్‌, టీ క‌ప్పులు.. ఇలాంటి చిన్న‌చిన్న‌విష‌యాల‌ను కూడా కొండంత త‌ప్పులుగా వేలెత్తి చూప‌డం ఎందుక‌ని విమ‌ర్శిస్తున్నారు. ప‌ని చేయ‌క‌పోతే ఇల్లు ముందుకు సాగ‌దు అని చెప్పిన ఆవిడే ఇప్పుడు ఏ ప‌నీ చేయ‌కుండా త‌ప్పించుకుంటోంది అని కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం మాస్ట‌ర్‌తో ఎవ‌రు ఉంటే వారికి వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఆయ‌న వ‌ల్ల‌ అప్పుడు దివి, ఇప్పుడు అవినాష్‌, మెహ‌బూబ్, అరియానా మీద నెగెటివిటీ పెరుగుతోందంటున్నారు. (చ‌ద‌వండి: చెప్పొద్దనుకున్నా, కానీ నా అస‌లు పేరు: అరియానా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement