‘బిగ్‌బాస్’ప్రియులకు శుభవార్త. త్వరలోనే ఈ బిగ్ రియాల్టీ షో ఐదో సీజన్ ప్రారంభమవబోతుంది. ఈ విషయాన్ని స్టార్‌మా అధికారికంగా తెలియజేస్తూ బిగ్‌బాస్ 5 లోగోని విడుదల చేసింది. ఈసారి ఈ రియాల్టీ షో బంగారు చిట్టడవిలా ఉంటుంది. బిగ్‌బాస్ విజువల్ ఐడెంటిటీని ఈ ఆలోచనను ప్రతిబింబించడంతో పాటుగా ఈ గేమ్‌లోని అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే రీతిలో రూపొందించారు.
ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది తీర్చిదిద్దబడింది. బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించే పోటీదారులందరూ విజేతగా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు. ఈ ఇంటికి ఒకటే ప్రవేశ, బయటకు పోవు మార్గాలు ఉండటం మాత్రమే కాదు, అనేక భ్రమలు, నటన, నాటకీయత, ప్రేమ, వినోదం, సరదాకు దారితీసే పలు మార్గాలూ ఉన్నాయి. ఎన్నో మెళికలు మరెన్నో మలుపులు ద్వారా ఆకట్టుకునే రీతిలో బిగ్‌బాస్ ఈ సారి వినోదం అందించడానికి సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉంటే, ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment