పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్ట్ లో సమంత టాప్ లో ఉంది. పలు సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇటీవల ఆర్ మాక్స్ అనే సంస్థ చేసిన సర్వేలో కూడా నటి సమంతనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అందుకు తగ్గట్టే సమంత కూడా పాన్ ఇండియా స్థాయిలో రాణించాలనుకుంటుంది. ఇప్పుడు ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. బీటౌన్‌లో సామ్ చాలా చిత్రాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది.కాని సమంత మాత్రం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తోంది. సామ్ ఇలా ఎందుకు చేస్తోంది అంటే, అందుకు రీజన్ రష్మిక అట.
నిజానికి రష్మిక పుష్ప చిత్రంద్వారానే బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరైంది. తాను నటించిన తొలి హిందీ చిత్రం రిలీజ్ కాలేదు. అయినప్పటికీ అక్కడ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. మిషన్ మజ్ను,గుడ్ బై, యానిమల్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.
బాలీవుడ్‌లో రష్మిక స్పీడ్‌కు బ్రేక్స్ వేసేందుకు సామ్ రెడీ అవుతోంది. తాను నటిస్తున్న మూడు పెద్ద ప్రాజెక్ట్స్‌ను ఒకేసారి అనౌన్స్ చేసి రష్మిక కు షాక్ ఇవ్వాలనుకుంటోందట వీరిద్దరి మధ్య ఈ స్థాయిలో ప్రొఫెషనల్ రైవల్‌రీ ఎలా పుట్టింది అనేది అర్ధం కాకుండా ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో మాత్రం బాలీవుడ్‌లో సామ్ వర్సెస్ రష్మిక వార్ పీక్స్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment