
కలిసి సినిమాలు చేసినంత మాత్రాన అందరం ఒకే ఫ్యామిలీలా కలిసిపోతామన్న రూలేం లేదంటున్నాడు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య. ఈ నటుడు జాన్వీ కపూర్‌తో కలిసి ఉలజ్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఇటీవల ఉలజ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆయన పై కామెంట్లు చేశాడు. తనతో వైబ్ రావడం లేదని నిర్మొహమాటంగా చెప్పాడు.
డైరెక్టర్ చెప్పినప్పుడు నా దగ్గరకు వస్తుంది, యాక్ట్ చేస్తుంది. తనొక ప్రొఫెషనల్ యాక్టర్ కాబట్టి అలాగే మెసులుకుంటుంది. కానీ షూటింగ్ గ్యాప్‌లో ఎక్కువగా మాట్లాడుకోలేదు, ఫ్రెండ్స్ కూడా కాలేకపోయాం అని తెలిపాడు. తాజాగా ఆ కామెంట్లపై బాలీవుడ్ బ్యూటీ స్పందించింది. 'నిజంగానే మేము కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోలేదు. ఒకసారైతే మమ్మల్ని కాఫీకి అలా వెళ్లిరమ్మన్నారు.

షూటింగ్ గ్యాప్‌లో ఎవరో తెలియనట్లు ఇలా కూర్చున్నారేంటి? కలిసి టీ తాగి రండి, సరదాగా జోక్స్ చెప్పుకోండి అని నాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగైతే అతడి వేసే జోకులకు మీరు నవ్వండి లేదంటే తను ఫీలవుతాడన్నాను' అని చెప్పుకొచ్చింది.
ఇకపోతే జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’, రామ్‌చరణ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్), హిందీలో వరుణ్ ధావన్ ‘సన్నీ సంస్కారీకీ తులసీ కుమారి’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. గుల్షన్‌తో కలిసి యాక్ట్ చేస్తున్న ఉలజ్ మూవీ ఆగస్టు 2న విడుదల చేయనున్నారు.
చదవండి: ఇన్నాళ్లకు బాబును చూపించించిన బ్యూటీ.. 12 ఏళ్ల క్రితం తెలుగులో..