రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది. కిరిక్‌పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ నటించిన తొలి సినిమా ‘ఛలో’తో సూపర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. హిందీలో 'మిషన్ మజ్ను' సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాకి మాత్రం టైం కేటాయిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ భామ చేసే చేష్టలు, పెట్టే వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే ఆమెకి అభిమానులు రోజు రోజుకి పెరిగిపోతుంటారు. ఇటీవల ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లపైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుని రికార్డు సృష్టించింది.
ఈ నెషనల్ క్రష్ తాజాగాసోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. షూటింగ్ విరామ సమయంలో పూల తలపాగా ధరించి వెరైటీ లుక్స్‌తో ఫోటోకి పోజులు ఇచ్చింది ఈ అల్లరి బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment